SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 08 at 6.14.35 PM

రూ,,1,06,990/- నగదు, (7) సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పేకాట శిబిరంపై దాడి చేసి 9 మందిని అరెస్టు చేసినట్లు ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఏసీపీ శివరామయ్య తెలిపారు.
టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దతండ గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం రూరల్ ఎస్సై వెంకటకృష్ణ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పేకాట అడుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.1,06,990/- నగదు, 7 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


SAKSHITHA NEWS