SAKSHITHA NEWS

పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ ఘాటైన విమర్శలే చేస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి కిరణ్‎పై కూడా అదే రీతిలో కౌంటర్ అటాక్ ఇస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. రాజంపేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బరిలో నిలిచారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య వైరం ఇప్పుడు డైలాగ్ వార్‎గా మారింది. నాలుగు రోజుల క్రితం పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిపై కిరణ్ చేసిన కామెంట్స్, ఆ మరుసటి రోజే కిరణ్‎పై మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ అటాక్ జరిగింది. రొంపిచర్లలో పర్యటించిన రాజంపేట బిజెపి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పనిలో పనిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మాజీ సీఎం కిరణ్ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ పాడి, మామిడి రైతాంగాన్ని నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్ర అభివృద్ధి అంటే పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమే అభివృద్ధి అని విమర్శించారు. అనుమతులు లేకుండా పెద్దిరెడ్డి కుటుంబం చేసిన రెండు ప్రాజెక్టు పనులకు NGT రూ.100 కోట్లు జరిమానా విధించిందని ఇదంతా ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు మాజీ సీఎం కిరణ్. పెద్దిరెడ్డి ఆయన కుటుంబం అధికార ఆహంతో పోలీసుల అండ చూసుకొని రెచ్చిపోతుందన్నారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. పుంగనూరు ప్రాంతంలో 5ఏళ్లలో చేసిన నిర్వాహకమేంటని ప్రశ్నిస్తే తాను ఓటమి భయంతో మాట్లాడుతున్నానని విమర్శిస్తున్నారని కిరణ్ అన్నారు.

మట్టి, మైన్స్, రెడ్ శాండిల్, ఇసుకలో భారీ దోపిడీ జరిగిందని ఈ ప్రాంత అభివృద్ధిని బాధ్యతగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. బెదిరింపులకు అక్రమ కేసులకు భయపడకుండా ప్రజలు ఓటు వేయాలని కేంద్ర బలగాల భద్రతతో ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు కిరణ్. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లపై సిబిఐ విచారణ జరిపిస్తామన్నారు. ఇది అతి పెద్ద క్రైమ్‎గా అభిప్రాయపడ్డ కిరణ్ దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. సిబిఐ విచారణ కన్నా ముందు ఓటుతో పెద్దిరెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.

WhatsApp Image 2024 04 08 at 12.02.29 PM

SAKSHITHA NEWS