ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్…

Spread the love

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్…

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం…

కొంపల్లిలో 473 మందికి కొత్త ఆసరా పింఛన్‌ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్పష్టం…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రారంభించారు. ఈ మేరకు కొంపల్లి మున్సిపాలిటీకి చెందిన 473 మంది నూతన పింఛనుదారులకు ఏఎంఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ఆసరా పింఛన్‌ కార్డులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు ప్రతి నెలా అందుతున్నాయని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఘనత తెలంగాణదేనని చెప్పారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గత ప్రభుత్వాలు ఎందుకూ సరిపోని రూ.200 పింఛన్ ఇచ్చేదని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2,016 అందిస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కారు పని చేస్తున్నదన్నారు. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమిషనర్ రఘు మరియు వివిధ వార్డుల కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page