అమూల్య‌మైన కేసీఆర్ సేవ‌లు దేశానికి అవ‌స‌రం.. బండ్ల గ‌ణేశ్

Spread the love

KCR’s invaluable services are needed by the country.. Bandla Ganesh

అమూల్య‌మైన కేసీఆర్ సేవ‌లు దేశానికి అవ‌స‌రం.. బండ్ల గ‌ణేశ్ ట్వీట్

యాదాద్రి:తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమూల్య‌మైన సేవ‌లు ఈ దేశానికి అవ‌స‌రం అని ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేశ్ ట్వీట్ చేశారు. యాదగిరి న‌ర‌సింహ‌స్వామి ఆల‌యం చూసిన త‌ర్వాత‌ ఈ రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా అద్భుతమైన ప్ర‌గ‌తిప‌థం వైపు న‌డిపించే స‌త్తా, సామ‌ర్థ్యం కేసీఆర్‌కు ఉన్నాయ‌ని పూర్తిగా న‌మ్ముతున్నాను అని బండ్ల గ‌ణేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహస్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం కేసీఆర్ ప‌రిపాల‌న‌ను ప్ర‌శంసిస్తూ గ‌ణేశ్ వ‌రుస ట్వీట్లు చేశారు.

కేసీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు..

ఎన్నో రోజుల నుంచి శ్రీ ల‌క్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.. ఆ స్వామివారి అనుగ్రహం లేక నాకు రావటం కుదరలేదు. కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కతజ్ఞతలు. తెలంగాణ అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకుపోతుంది అని చెప్పటానికి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ నిదర్శనం. కేసీఆర్ ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా వాటిని నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానంగానీ మహా అద్భుతంగా తృప్తి చెందాను. చాలా సంతోషం అనిపించింది.. ముఖ్యమంత్రి గారు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నాను.

కేసీఆర్ సంక‌ల్పం గొప్ప‌ది..

మీ మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మీ మదిలో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న మీ సంకల్పం చాలా గొప్పది. ఆనందంగా, చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికే గాక భారతదేశం మొత్తానికి మీ అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడింది, ఆనందాన్నిస్తుంది. నరసింహస్వామిని చూసిన తర్వాత ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు మీపై ఉండాలని, ఎల్లవేళలా ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఉండాలని మా ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్.

ల‌వ్ యు కేసీఆర్..

ఏ స్వార్థం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు. నా మనసులోని మాటలు చెప్తున్నాను. మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను. అది నా నైజం సార్..! మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు అంటూ బండ్ల గ‌ణేశ్ త‌న ట్వీట్ల‌లో పేర్కొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page