SAKSHITHA NEWS

భారీ ఆధిక్యతతో తమ విజయం ఖాయం, సీ ఎం గా కెసిఆర్ ఎన్నిక కావడం తధ్యం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్


సాక్షిత : ఎన్నికల ప్రచారానికి శ్రీకారం, బౌద్దనగర్ లో విస్తృతంగా పాదయాత్ర,
ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపిన స్థానికులు
సికింద్రాబాద్ అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ కార్యకలాపాల నిర్వహణలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నిత్యం అగ్ర స్థానంలో నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, ఎన్నికల్లో తాము భారీ ఆధిక్యతను సాధించుకోవడంతో పాటు సీ ఎం గా కెసిఆర్ హ్యాట్రిక్ సాధించడం తధ్యమని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సికింద్రాబాద్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ సోమవారం ప్రారంభించారు. బౌద్దనగర్ డివిజన్ లోని పార్సీ గుట్ట నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్ధించారు.

పార్సీగుట్ట, సంజీవపురం, అశోక్ నగర్, మధురానగర్, రాజేవ్ నగర్, అంబర్ నగర్ ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులకు తాము పరిష్కారాన్ని చూపామని పద్మారావు గౌడ్ తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తన పలుకుబడిని కేవలం ప్రజా సంక్షేమానికి వినియోగించానని, ఫలితంగా తుకారంగేటు ఆర్ యు బీ నిర్మాణం, సితాఫలమండీ లో జూనియర్-డిగ్రీ కాలేజీల ఏర్పాటు, వివిధ ప్రాంతాల్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం, కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం, లాలాపేట-అడ్డగుట్ట ప్రాంతాల్లో కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణం, కొత్త స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, మంచి నీటి ఎద్దడి నివారణ, సివరేజ్ సమస్యల పరిష్కారం, నాలా వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల నివారణ వంటి వివిధ అంశాలన్నీ పరిష్కరించామని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు.

కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరి కొన్ని పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తమ పనితీరు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించి తమకే ఓటు వేయాలని ఆయన కోరారు. పలు బస్తీల్లో పద్మారావు గౌడ్ కు ఈ సందర్భంగా ఘన స్వాగతం లభించింది. పార్టీ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్యకర్తలతో కలిసి ఇంటింటి కి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. కార్పొరేటర్ కంది శైలజ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత రమేష్, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ కూడళ్ళలో పద్మారావు గౌడ్ ను ఘనంగా సత్కరించి దీవించడంతో పాటు మంగళ హరతులతో స్వాగతం పలికారు. పలు బస్తీ ల సంక్షేమ సంఘాల నేతలు , కుల సంఘాల ప్రతినిధులు బీ ఆర్ ఎస్ కు తమ మద్దతు తెలుపుతూ పద్మారావు గౌడ్ ను అభినందించారు. పద్మారావు గౌడ్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. – – సికింద్రాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ కార్యాలయం

Whatsapp Image 2023 10 16 At 4.18.10 Pm

SAKSHITHA NEWS