బుడుమూరులో ఘనంగా కార్తీక దీపోత్సవం

Spread the love

Kartika Deepotsava is celebrated in Budumuru

బుడుమూరులో ఘనంగా కార్తీక దీపోత్సవం
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ కోదండరామ-విశ్వేశ్వర నాగ బంధన,సహిత సుబ్రమణ్య దేవాలయము వద్ద గురువారం రాత్రి ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది.ఆలయ ధర్మకర్త మామిడి మధుసూదన రావు ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 1101 దీపాలతో ఆరాధనకు చొరవ తీసుకున్నారు.ఓంకారము,శివలింగ ఆకారము,తదితర ఆకారాలలో ప్రమిదలను పేర్చి దీపాలు వెలిగించి భక్తిభావంతో చాటుకున్నారు.స్వయంభూ శ్రీ రామ్ మందిరం వద్ద అక్షర రూపం వెలిగించిన దీపాలు ఆకట్టుకున్నాయి.అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మామిడి మధుసూదన రావు,ఆలయ అర్చకులు శ్రీరామ్ మూర్తి శర్మ,నగేష్ శర్మ ,గ్రామ పెద్దలు,మహిళలు భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page