SAKSHITHA NEWS

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …


సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మండల సిఐటీయూ కన్వీనర్ బి. లింగస్వామి అధ్వర్యంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పిండంతో పాటు 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎంప్లాయ్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సుమారు 64 వేల మంది ఇటువంటి ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని వీరికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పర్మినెంట్ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్టుగానే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఫిక్స్ డ్ పే, ఐఆర్ అందించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితిలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాను శాయశక్తుల కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఎల్లయ్య, పెంటయ్య, మధు, సుశీల, బాలయ్య, రవి, జివేందర్, అమృత, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 23 At 12.17.41 Pm

SAKSHITHA NEWS