అనారోగ్య కారణాలతో మరణించిన ఏఎస్సై కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రం

Spread the love

అనారోగ్య కారణాలతో మరణించిన ఏఎస్సై కుమారుడికి కారుణ్య నియామకాల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,

అనకాపల్లి, : ఏఎస్సై అర్.తులసీనాథ్, విశాఖపట్నం సిటీ సిసిఎస్ లో పని చేస్తూ, తేది.04.09.2021 న అనారోగ్యంతో మరణించారు. కారుణ్య నియామకం లో భాగంగా అతని కొడుకు అర్.హోమ్ వెంకట నాథ్ కు అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ గా నియామకపు ఉత్తర్వులను జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కారుణ్య నియామకం క్రింద ప్రభుత్వం
ఇచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకొని, అంకితభావంతో పని చేస్తూ, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని,
జీవితంలో అభివృద్ధి సాధించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) బి.విజయభాస్కర్, పరిపాలన అధికారి(ఏ.ఓ)శ్రీమతి బి.శారద, సూపరింటెండెంట్ విజయ కుమార్, సీనియర్ అసిస్టెంట్ బాలు మహేంద్ర పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం,
అనకాపల్లి.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page