సాక్షిత చిట్యాల :
ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ఎం డి జహంగీర్ ను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ రైతుల, కూలీల, మహిళల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే జహంగీర్ ను పార్లమెంటుకు పంపించాలని కోరారు. అవకాశవాద, అవినీతికర పార్టీల అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఓడించి, కమ్యూనిస్ట్ అభ్యర్థులను గెలిపించాలని నగేష్ విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ చొప్పరి సంధ్యారాణి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాలమాకుల అర్జున్, బొబ్బలి వెంకట్ రెడ్డి, దామ రోజు పోతులూరి, గుండెబోయిన సాయి, చొప్పరి నాగ పణి, కర్నెకంటి లింగయ్య, జ్యోతి, బొబ్బలి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎండి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని:జిట్టా నగేష్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…