SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్, వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ అవిశెట్టి శంకరయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల లో సోమవారం నాడు స్థానిక తహసిల్దార్ జె శ్రీనివాస్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో చిట్యాల ,గుండ్రాంపల్లి, వట్టిమర్తి గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేసి పేదలకు అందజేయాలని కోరారు. అదేవిధంగా చిన్నకాపర్తి ,నేరడ ,ఉరుమడ్ల ,తదితర గ్రామాలలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూమి కొనుగోలు చేసినా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు.

వెంటనే పేదలకు పంపిణీ చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు‌. ఇంటి స్థలం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇండ్ల నిర్మాణం కొరకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహా, బొబ్బలి సుధాకర్ రెడ్డి, కోనేటి రాములు ,రూపని ఇద్దయ్య, దూడల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS