శంకర్పల్లి పట్టణ కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను శనివారం మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. మహేశ్వరరావు, ఉపాధ్యాయులు అరుణ జ్యోతి, స్వాతి శ్రీ, స్వాతి ప్రియా, మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఫాతిమా, ధనలక్ష్మి, హరికృష్ణ, డా. రంజిత్ కుమార్ గౌడ్, సబితా రెడ్డి, బాలప్రభ, శ్వేత, అశోక్ పాల్గొన్నారు.