జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ నూతన అధ్యక్షులు

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

2023-25 సంవత్సరానికి గాను జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం వన్ టౌన్ అధ్యక్షులుగా అబ్దుల్ మలిక్, టూ టౌన్ అధ్యక్షులుగా అబ్రార్ అలీ త్రీ టౌన్ అధ్యక్షులుగా షేక్ రఫీ ను జమాఅతె ఇస్లామీహింద్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. నేడు జమాఅతె ఇస్లామి హింద్ స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన వారు మాజీ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ ఖాన్, జమీల్ అహ్మద్ ఖాన్. అబ్దుల్ సుబర్ వారి వద్ద నుండి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు మాట్లాడుతూ దైవ సహాయంతో జమాఅతె ఇస్లామి హింద్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని జమాఅతె కార్యక్రమాలను విస్తరింప చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని దీనికోసం ప్రతి సభ్యుడు మరియు కార్యకర్త సహకరించాలని అన్నారు దివ్య ఖురాన్ మరియు ప్రవక్త (స అ స) బోధనలకు అనుగుణంగా జీవితం గడుపుతూ యావత్ లోకానికి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

జమాఅతె సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జాఫర్ మతిన్, యుసూప్ షరీప్, నిహల్ అహ్మద్,రఫీ,మునీర్, జైనుల్ పాషా,మహిముద్ షరీఫ్ అబ్దుల్ లతీఫ్, కుదరతుల్లా, నిజాముద్దీన్, అబ్దుల్ సమి, అబ్దుల్ రజాక్, గౌస్, షేక్‌ ఇలియాస్‌ , ఇంతియాజ్‌, అబ్దుల్ హాది, ఎస్ ఐ ఓ పట్టణ అధ్యక్షులు ఆమెర్ తదతరులు పాల్గున్నారు

Related Posts

You cannot copy content of this page