SAKSHITHA NEWS


Jagruth Neuro Camp is a special treat

జాగృత్  న్యూరో క్యాంపుకు విశేష ఆదరణ

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

ఖమ్మం నగరం నడిబొడ్డున గల జాగృత్ గ్యాస్ట్రో, న్యూరో,  యూరో , ఎండోక్రైన్  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం నిర్వహించిన న్యూరో  క్యాంపుకు విశేష ఆదరణ లభించింది.

ప్రపంచ పక్షవాత (వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్) దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ క్యాంపులో మెదడుకు సంబంధించిన వివిధ రుగ్మతలపై కేవలం  3000 రూపాయల విలువైన పరీక్షలను కేవలం 600 రూపాయిల కే  తలపెట్టారు. ఉదయం 10 గంటలనుండి సాయంత్రం ఐదు గంటల వరకు సాగిన ఈ క్యాంపులో సుమారు 250  మంది కీ పైగా హాజరయ్యారు.

కాగా స్క్రీనింగ్ టెస్ట్ లో సుమారు 50 మందికి బ్రెయిన్ స్ట్రోక్ కు ఉన్నట్లు తొలిసారిగా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా 20 మందికి బీపీ,       ముప్పై మందికి షుగరు , 20 మందికీ కొలెస్ట్రాల్ , 10 మందికీ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లు తొలిసారిగా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించడం జరిగింది.

డాక్టర్ రాజశేఖర్ గౌడ్, డాక్టర్ నిఖిల్ రేపాక లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్. పరదేశి , డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ మనోజ్, డాక్టర్ శ్రీకాంత్, పి ఆర్ ఓ లు నవీన్, కళ్యాణ్, బాబు, సతీష్ ఆసుపత్రి సిబ్బంది ఫాతిమా, బేబీ, కృష్ణ వాసు లోకేష్ కళ్యాణ్, వెంకట్ ,భాగ్యలక్ష్మి, కృష్ణ, నర్సింహ రావు, స్వీటీ, జబ్బార్,రమేష్, లాబ్ సిబ్బంది స్వప్న, ఉపేందర్, సాయి,   శ్రీను, కళ్యాణ్ , మెడికల్ సిబ్బంది కిరణ్, సాయి, లక్ష్మి, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS