SAKSHITHA NEWS

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గొనీ దిశానిర్దేశం చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ,ఎన్నికల ఇంచార్జి లోక బాపు రెడ్డి .

వారు మాట్లాడుతూ

ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి నిజాంబాద్ పార్లమెంటు స్థానం బిఆర్ఎస్ పార్టీ గెలిచేలా చొరవ చేసుకోవాలి

కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలం. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుంది.

పైరవీకారులు నాయకులే పార్టీలు మారుతున్నారని కార్యకర్తలు కాదని అన్నారు

10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించిన పార్టీ బిఆర్ఎస్

ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చింది.. కాంగ్రెస్ అమలు చేయని గ్యారెంటీ లపై వాడవాడలా చర్చ పెట్టాలని అన్నారు

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం

ప్రారంభంలో గులాబీ జెండాను చూసి నవ్విన ప్రజలే నేడు గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు

కాంగ్రెస్ బిజెపి అబద్ధపు హామీలు మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయి…

బిజెపి ఎంపీ అరవింద్ కేసీఆర్ కేటీఆర్ కవితను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు.. నిజాంబాద్ పార్లమెంటు అభివృద్ధిని ఆయన మరిచారు..ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు..

అమలు కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్.. వారి హామీలే వారి పార్టీకి ఉరితాడుగా మారుతుంది ..

బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారు..మళ్ళీ ఇంకో తప్పు చేయాలని ప్రజలు అనుకోవట్లేదు..

జీవన్ రెడ్డి అరవింద్ ఇద్దరినీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు పార్లమెంటు ఎన్నికల్లో సైతం ప్రజలు తిరస్కరిస్తారు..

శ్రీరాముని పేరు మీద రాజకీయం చేయడం బాధాకరం….

శ్రీరాముడు అందరివాడు అన్ని వర్గాల ప్రజలు రామునికి పూజ చేస్తాయి

బాజిరెడ్డి మంచి నాయకుడని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా 3 వేరు వేరు ప్రాంతాల నుండి గెలిచారని అన్నారు..

నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా,నిజంబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కావలసిన నిధులు తెచ్చుకోవచ్చు,తెలంగాణ రాష్ట్ర హక్కులపై,నిధులపై కేంద్రం తో పోరాటం చేయవచ్చు అని అన్నారు..

తెలంగాణ ప్రజలకు అండ గులాబీ జెండా అని అన్నారు..

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ,
ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉప అధ్యక్షులు ఓల్లెం మల్లేశం,దుమల రాజ్ కుమార్,నాయకులు దామోదర్ రావు,సమిండ్ల శ్రీనివాస్,సుధాకర్,యూత్ అధ్యక్షులు గిరి,మహిళ విభాగం అధ్యక్షులు కచ్చు లత
విద్యార్థి విభాగం యం ఏ ఆరిఫ్,కార్మిక విభాగం తొలిప్రేమ శ్రీనివాస్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 25 at 12.01.18 PM

SAKSHITHA NEWS