SAKSHITHA NEWS

బస్ డిపో ఎన్నికల హామీ వరకే పరిమితం కావడం దురదృష్టకరం.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమ మహేష్.


*సాక్షిత : * జగతగిరిగుట్ట సీపీఐ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద జగతగిరిగుట్ట లో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ రిలే నిరాహారదీక్ష కూర్చోవడం జరిగింది.
ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి,రాజు ,ఇమామ్ లకు పూలదండ వేసి నిరాహారదీక్ష ను నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ ప్రతీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు తమ మ్యానిఫెస్టోలో హెచ్ఏంటీ స్థలంలో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి గెలిచాక పట్టించుకోకపోవడం అన్యాయమని ఇప్పుడు గతం కంటే జనాభా పెరిగి బస్సుల రద్దీ పెరిగడం తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడితుందని అలాగే పెరిగిన జనాభా ప్రకారం వైద్య సౌకర్యం కల్పించడానికి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ కూడా నిర్మించాలని, నిర్మించే వరకు సీపీఐ తరపున అనేక పోరాట రూపాలను రూపొందించి ప్రజలకు అవసరాలను చెప్పి ప్రజా ఉద్యమం నిర్మిస్తామని అన్నారు.అదే విదంగా జగతగిరిగుట్ట లో రహదారులు చిన్నగా ఉండటం వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని కావున వెంటనే రోడ్డును వెడల్ప్ చెయ్యాలని సీపీఐ పోరాటం నిర్వహిస్తే అధికారులు స్పందించినప్పటికి ముందుకు సాగట్లేదని ఈ విషయాన్ని అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు తో ప్రస్తావించేలా చేస్తామని చెప్పారు.


ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్ రావ్, మునిసిపల్ అధ్యక్షుడు రాములు, మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య,సీపీఐ నాయకులు నగేష్ చారి,ప్రభాకర్, చంద్రయ్య, సామెల్,రవి,యాదగిరి,ఈశ్వర్, నర్సింహ, ఆశయ్య,సుధాకర్, యువజన నాయకులు బాబు,కీర్తి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 06 at 2.35.10 PM

SAKSHITHA NEWS