SAKSHITHA NEWS

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .


సాక్షిత : * అన్నమయ్య సర్కిల్ స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో మాట్లాడుతూ వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మహిళల పక్షపాతి అని మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లంచాలు లేకుండా వాలంటీర్లు, సచివాలయల వ్యవస్థ ఏర్పాటు చేసి మీ ఇంటి ముందుకే పథకాలను చేరవేస్తున్న ఘనత మన జగనన్నదే. గతంలో ఏ నాయకుడు ఇలాంటి మంచి పనులు చేయలేదు. గతంలో మీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా కలెక్టర్ ఆఫీస్, ఎమ్మార్వో ఆఫీస్, ఆర్డీవో ఆఫీస్‌ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా మీ ఇంటి వద్దకే అన్ని వస్తున్నాయి.

జగనన్న అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో దాదాపు రూ.35వేల కోట్లు డ్వాక్రా రుణాలను మాఫీ చేశారు. ఆర్థిక భరోసా ఇచ్చేలా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.18,750 ఇస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ ఏడాది నగదు అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో వేయనున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా జగనన్న మహిళా మార్ట్‌లు స్థాపించి లాభాల బాట పట్టించాం.

ఇక నేను డిప్యూటీ మేయర్ అయిన తొలి రోజు నుంచి తిరుపతి అభివృద్ధిని చేసుకుంటూ వస్తున్నాను. వారసత్వంగా వచ్చి ఓటు అడగటం లేదు.. నా అభివృద్ధి చూసి ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నాను. చంద్రబాబును గెలిపిస్తే మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. వాలంటీర్లు, సచివాలయాలను తీసివేస్తారు. అందుకే మనకు మంచి పనులు చేస్తున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది.

WhatsApp Image 2024 02 17 at 2.03.20 PM

SAKSHITHA NEWS