SAKSHITHA NEWS

పత్రిక ప్రకట

తేది:-19-11-2023

Whatsapp Image 2023 11 19 At 6.47.35 Pm

భద్రాద్రి రాముని తలుపులు,భద్రాచల ప్రజల మనస్సులు తాకటం మీ వల్ల కాదు….

10 ఏండ్లు అధికారంలో ఉండి కన్నెత్తి భద్రాచలం వైపు చూడని, కేటీఆర్ కు భద్రాచలం ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు…..

దున్నపోతుకి గడ్డి వేసి, గేదెను పాలిమ్మంటే ఇస్తుందా అని కేటీఆర్ భద్రాచలం వచ్చి అంటుండు….

పదేండ్లు అధికారంలో ఉన్నది మీరే కదా,మరి మీరు గేదెల,దున్నపోతుల చెప్పాలి….

మూడు పంచాయతీల GO ను వీరయ్య వ్యతిరేకిస్తుండగానే, పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న నువ్వు GO ను అసెంబ్లీ సాక్షిగా ఆమోదింప చేశావు…..

ఈరోజు భద్రాచలం వచ్చి ప్రజలు పంచాయతీలు మూడైన,ఒకటైన ప్రజల ఇష్టం మేరకే,అని రాజకీయం చేసి ఓట్లు దండుకునేందుకు డ్రామాలాడుతున్నావు….

మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు….

ఈరోజు భద్రాచల శాసనసభ్యులు పొదెం వీరయ్య గారి నివాసంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు పాల్గొని మాట్లాడుతూ…..

పదేండ్లు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన కల్వకుంట్ల తారక రామారావు, ఎట్టకేలకు భద్రాచల ప్రాంతానికి రాగలిగాడు…..

ప్రోగ్రాం షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 కు భద్రాచలం కి రావాల్సిన దొరగారు, కరెక్టుగా ఆ టయానికి వస్తే ఎక్కడ రాముల వారి దర్శనం చేసుకోవాల్సి వస్తుందని, రామయ్య గుడి తలుపులు మూసే ఒంటిగంట టయానికి భద్రాచలనికి వచ్చిండు, అసలు రామయ్య దర్శనం అంటే కల్వకుంట్ల వారి కుటుంబానికి ఎందుకంత భయమో అర్థం కావటం లేదు.

ఆంధ్రాలో కలిసిన ఐదు పంచాయతీల విషయాన్ని గాలికి వదిలేసి, భద్రాచలం నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న పొదెం వీరయ్య గారు వ్యతిరేకిస్తున్న సరే,ఉన్న ఒక్క పంచాయతీని మూడు పంచాయతీలు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా GO ను ఆమోదింపజేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం…..

ఈరోజు భద్రాచలానికి వచ్చి మూడు పంచాయతీల జీవోతో మీకు ఏమి సంబంధం లేనట్టుగా, ఎమ్మెల్సీ తాత మధు రాసిచ్చినట్టుగా మాట్లాడి భద్రాచల ప్రజలను మోసం చేసి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు…..

భద్రాచల డంపింగ్ యార్డ్ నిర్మాణానికి ఎమ్మెల్యే అడ్డుపడ్డాడని అసత్యాలు మాట్లాడుతున్నారు,అసలు భద్రాచలంలో డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉందో మంత్రి కేటీఆర్ కి గాని,ఎమ్మెల్సీ తాత మధుకు గాని తెలుసా……

ఒకపక్క డంపింగ్ యార్డ్ పనులు జరుగుతూ ఉంటే, డంపింగ్ యార్డ్ పనులు ఎమ్మెల్యే అడ్డుకున్నాడు అనటం మీ అవివేకానికి నిదర్శనం……

కల్వకుంట్ల వారి మాయ మాటలు భద్రాచలం ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరటానికి ఈరోజు జరిగిన కేటీఆర్ రోడ్ షో నే నిదర్శనమని…..

ఈ రోడ్ షో కోసం ఎమ్మెల్సీ తాత మధు,భద్రాచలం బిఆర్ఎస్ నాయకులు కాలనీ కాలనీకి వెళ్లి ప్రజలను కేటీఆర్ వచ్చే సభకు రావాలని బతిమిలాడినా సరే, సభకు రాకుండా బి ఆర్ ఎస్ నాయకులకు సరైన గుణపాఠం చెప్పారు……

ఈరోజు భద్రాచలంలో నిర్వహించిన కేటీఆర్ రోడ్ షో ఫ్లాప్ అవ్వడమే, భద్రాచల నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య గెలుపు కోరుకుంటున్నారని చెప్పకనే చెప్పారు….

ఇకనైనా భద్రాచల నియోజకవర్గ ప్రజలను కాపాట నాటకాలతో మోసం చేయడం మానేసి, ఇప్పటివరకు చెప్పిన అబద్ధాలకు ఆ భద్రాచల రామయ్యను, భద్రాచల ప్రజలను క్షమాపణ కోరుకోవాలని ఆయన మాట్లాడారు.

ఈ పత్రికా సమావేశంలో….
టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి,ఆడబాల వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, నియోజకవర్గం అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతిరేల సుధీర్, టిడిపి నాయకులు కొడాలి శ్రీనివాస్,ఎస్కే అజీమ్, మాగాపూర్ రాజు,చెంచు సుబ్బారావు, కొలపడి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS