SAKSHITHA NEWS

సాక్షిత : ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని BJP ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని, తక్షణమే ప్రధాని మోడీ గద్దె దిగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు గురువారం మంత్రి తలసాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని MG రోడ్ లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా, అనంతరం కట్టెల పొయ్యి పై మంత్రి తలసాని వంట చేసి నిరసన తెలిపారు. మోడీ హటావో…దేశ్ కీ బచావో, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి వంటి నినాచాలతో BRS నాయకులు, కార్యకర్తలు ధర్నాలో నినదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలు తగ్గించే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు.

నగరంలో, రాష్ట్రంలో BJP నేతలను ఎక్కడికక్కడే అడ్డుకోవాలని మహిళలకు మంత్రి పిలుపునిచ్చారు. 2014 సంవత్సరంలో 410.50 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధర కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని BJP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెంచుకుంటూ వస్తున్నారని, నేడు 1155 రూపాయలకు పెరిగిందని ధ్వజమెత్తారు. 8 సంవత్సరాల పాలనలో 7 45 రూపాయలు పెరిగిందని విమర్శించారు. గ్యాస్ ధర పెంపుతో నిత్యావసర వస్తువుల పై కూడా ప్రభావం చూపుతుందని వివరించారు. సబ్సిడీని భారీగా తగ్గించడం వలనే గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 2019 లో సబ్సిడీ కోసం 22,726 కోట్ల రూపాయలను కేటాయించగా…

ఈ సంవత్సరం 180 కోట్లకు తగ్గించడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలెండర్ కు దండం పెట్టి పోతూ వేసేందుకు వెళ్ళిన మోడీ నేడు ఇష్టానుసారంగా ధరలు పెంచడం పట్ల ఏం సమాధానం చెబుతారని హెచ్చరించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్దికి ఏ విధమైన సహకారం అందించాడంలేదని అన్నారు. తెలంగాణా రాష్ట్రం భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో ధర్నాలు, నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని BJP ప్రభుత్వం మేడలు వంచేందుకే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు TRS పార్టీ ని BRS పార్టీగా మార్చి దేశ రాజకీయాలతో పెనుమార్పులు తీసుకురానున్నట్లు వివరించారు.

వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తమకు దేశంలో ఎదురులేదని విర్రవీగుతున్న BJP ప్రభుత్వానికి గద్దె దిగే సమయం ఆసన్నమైందని, ప్రజలు తగి బుద్ది చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని అంటున్న BJP నేతలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పరిష్కరించలేని దద్దమ్మ BJP ప్రభుత్వం అని విమర్శించారు. ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పారు ఏమైందని అన్నారు. మెడికల్ కాలేజీలు ఇచ్చారా?, కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టు కోసం ఏమైనా నిధులు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని ౩౩ జిల్లాలలో 17 జిల్లాలలో జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని, మీకు దైర్యం ఉంటే మిగిలిన 16 జిల్లాలలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం, హైదరాబాద్ నగర అభివృద్దికి ఒక్క పైసా నిధులు తేలేని BJP నేతలు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఇష్టమొచ్చినట్లుగా విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్స్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, డివిజన్ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS