గడప గడపకి మన ప్రభుత్వం కార్యమానికి నేటితో 123రోజులు

Spread the love

It is 123 days from today that our government has been functioning for the past few days

వినుకొండ నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యమానికి నేటితో 123రోజులు

సాక్షిత : గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం 123వ రోజులో భాగంగా నూజెoడ్ల మండలం తలార్లపల్లి, గ్రామ సచివాలయం పరిధిలో దాంట్లవారిపాలెం గ్రామoలో గడప-గడపకి మన ప్రభుత్వం అంటూ మండల స్థాయి, గ్రామ సచివాలయం

స్థాయి ఉద్యోగులను వెంటపెట్టుకొని ప్రతీ గడపని సందర్శిస్తున్న సందర్భంగా ప్రతీ కుటుంబ సభ్యుడు జగన్నన ప్రభుత్వంలో, మీ ఆధ్వర్యంలో మాకు అర్హత ఉన్నంత వరకు అన్ని సంక్షేమ పధకాలు అందుతున్నాయని, మా పేద కుటుంబాలకి ఈ ఆర్ధిక సహాయం ఎంతో మేలు చేస్తుందని గ్రామ ప్రజలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కి విన్నవించుకోవడం జరిగినది.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఈ దాంట్లవారిపాలెం గ్రామoలో నా సొంత గ్రామంగా భావిస్తానని అదేవిధంగా ఈ గ్రామాల ప్రజలు నన్ను వారి సొంత కుటుంబసభ్యుడి లాగా చూస్తున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటానని, అదేవిధంగా ఈ గ్రామాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు అనేక విధాలా అభివృద్ధి చేస్తున్నామని,

ఈ గ్రామాలలో గత ప్రభుత్వం ఏవిధంగా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు అందరూ గమనిస్తున్నారని, అదేవిదంగా ఈ గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి చేస్తున్న వారికి అండగా ఉంటున్నారని ఇలానే గ్రామ ప్రజలందరు కలిసి కట్టుగా ఉండి సమిష్టిగా గ్రామాన్ని అభిహృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ గ్రామం నుండి నూజెoడ్ల గ్రామానికి వెళ్లే రోడ్ ఎన్నో సంవత్సరాల నుండి గుంతలుపడి రాకపోకలకి ఇబంది కరంగా ఉందని గ్రామస్తులు చెప్పిన వెంటనే ఆ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నాం,

అదేవిదంగా ఈ గ్రామం నుండి వ్యవసాయ పొలాలకు వెళ్ళే మార్గ మధ్యలో ఒక వాగు ఉందని దానిపై ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలనీ నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ గ్రామ ప్రజలు నాకు చెప్పడం జరిగిందని వెంటనే సంబంధిత శాఖ అధికారులకి ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబందించిన చర్యలు తిసుకోవలసినదిగా ఆదేశించడo జరిగిందని వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చెప్పట్టి పూర్తి చేయడం జరిగిందని ఈ బ్రిడ్జి ని ప్రారంభించడం ఏంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఈ గ్రామ రైతులకి ఈ బ్రిడ్జి చాలా ఉపయోగంగా ఉంటుదని,మేము చేసే అభివృద్ధి చేతలలో ఉంటుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా మాటల ప్రభుత్వం మాది కాదన్నారు. గత ప్రభుత్వం లో మాటలు లతో గ్రాఫిక్స్ తో రాష్ట్రా ప్రజలను మోసం చేసారని కాని ప్రభుత్వం వచ్చిన నాటినుండి ప్రజలు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వం లో ఈ గ్రామాల ప్రజలకి అందిన సంక్షేమ ఫలాలకి ఇప్పుడు మన ప్రభుత్వం లో గ్రామాల ప్రజలు పొందిన సంక్షేమ ఫలాలకి బేరిజు చేసుకోవాలని, ఈ విధంగా ప్రభుత్వం అధికారులను వెంటపెట్టుకొని ఏ శాసనసభ్యులు గ్రామoలో ప్రతి గడప దగ్గరకి రావడం ఎప్పుడైనా జరిగిందా,

కాని మన రాష్ట్రా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతి వారిని తన సొంత కుటుంబసభ్యుడిలాగా చూస్తున్నాడు కాబట్టే ప్రతి ఇంటికి తానే పెద్ద కొడుకులాగ ముందుండి నడిపిస్తానని తాను చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి గడపకి అధికారులని శాసనసభ్యులని పంపించి తాను అందిస్తున్న పధకాలు అన్ని సరిగా అందుతున్నాయా ఇంకా ఎవరైనా లబ్ది పొందనివారు ఉంటే వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి వారికి కూడా ఈ పధకాలు అందేవిధంగా చూడాలని అధికారులని ఆదేశించడo జరుగుతుంది.

Related Posts

You cannot copy content of this page