Invitation to Minister KTR for conference in America
అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్-ఎన్వైర్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.
ఇటీవల సంస్థకు సంబంధించిన పలు బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విధానం, సౌకర్యాలు, వేగంగా నిర్మాణం పూర్తి చేసిన విధానం సంస్థ బృందాన్ని ఆకట్టున్నాయి.
దీంతో ఆ సంస్థ ఎండీ బ్రెయిన్ పార్సన్స్ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్సన్ నేవడలో జరగనున్న సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు.