రెజోనెన్స్ ది స్కూల్ శ్రీనివాసరనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

స్థానిక శ్రీనివాసనగర్లో గల రెజోనెన్స్ ది స్కూల్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్ధులు యోగా గురువు ఆధర్వర్యంలో వివిధ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా రెజోనెన్స్ ది స్కూల్ విద్యార్థులు ఆరోగ్యానికి అతి ముఖ్యమైన సూర్యనమస్కారాలు, చక్రాసనం, ధనురాసనం, గరుడాసనం, అంజలి ముద్ర, హలాసనం, కాకాసనం మొదలగు ఎన్నో ఆసనాలను వేసినారు.


పాఠశాల డైరక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్ రెజోనెన్స్ ది స్కూల్ విద్యార్థులను ఉద్దేశిస్తూ యోగా ఒక విలువైన ప్రాచీన విద్యా అని, సనాతన జీవిన విధానం నుంచి వారసత్వంగా వస్తోందని ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారి వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. యోగ సాధనతో మానసిక బలం, అంతులేని ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత చేకూరుతుందని, విద్యా, ఆరోగ్యం, వృత్తిపై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుకోవడానికి యోగా ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమాన్నికి పాఠశాల డైరక్టర్స్ ఆర్. వి. నాగేంద్రకుమార్, కె. నీలమా, పాఠశాల
ప్రిన్సిపాల్, బోధన భోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page