SAKSHITHA NEWS

మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులను మునిసిపల్ చైర్మన్ G చిన్న దేవన్న పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పెద్ద వాగుపై అంబెడ్కర్ చౌక్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

ఇట్టి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలని అలాగే బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందని, కాబట్టి ఇట్టి బ్రిడ్జి నిర్మాణం వీలయినంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టరను ఆదేశించారు.

కార్యక్రమంలో R & B అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 12 14 at 5.54.30 PM

SAKSHITHA NEWS