SAKSHITHA NEWS

ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్

ACB వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టింది – వైఎస్ షర్మిలా రెడ్డి

పంజరం నుంచి ACB నీ విడుదల చేయండి – వైఎస్ షర్మిలా రెడ్డి

అదానీ – జగన్ 1750 కోట్ల ముడుపుల పై వెంటనే ACB దర్యాప్తు జరిపించాలి – వైఎస్ షర్మిలా రెడ్డి

అనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన TDP ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోంది – వైఎస్ షర్మిలా రెడ్డి

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

  • అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది
  • సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యింది
  • ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించింది
  • ఆధారాలు కూడా బయట పెట్టింది
  • ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ?
  • ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు ?
  • 2021 లో ప్రతిపక్షంలో ఉన్న TDP ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేశారు
  • ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు
  • రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల ఆర్థిక భారం అని ఆరోపణ చేశారు
  • అదానీ డీల్ వెనుక అవినీతి జరిగిందని తెలుసు
  • ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు
  • కోర్టు కేసు వేసిన పయ్యావుల మంత్రిగా అన్నారు
  • అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు?
  • జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు
  • నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే
  • అదానీ తో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుంది
  • ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేది
  • ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది
  • రేపు 50 పైసలకే వచ్చినా తగ్గొచ్చు
  • సోలార్ పవర్ రెట్లు తగ్గుంటుంటే… మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు ?
  • 2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారు.
  • చంద్రబాబు ను అడుగుతున్నాం
  • అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?
  • అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్ఛరించడం లేదు ?
  • అదానీ బీజేపీ మనిషి..మోడీ మనిషి. బీజేపీ తో మీకు అలయెన్స్ ఉంది
  • అందుకే మీరు అదానీ కి, మోడీ కి బయపడుతున్నారు
  • అదానీ నీ కాపాడుతున్నారు
  • రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారు
  • JPC వేయాలని డిమాండ్ చేస్తున్నారు
  • అయినా మోడీనోరు విప్పడం లేదు
  • మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు
  • అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు ?
  • ఈ అవినీతి బయట పెట్టని CBI చేతకానిదా?
  • మోడీ చేతకాని వాడా ?
  • ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ACB కి పిర్యాదు చేసింది
  • దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది
  • ACB స్వయం ప్రతిపత్తి గల సంస్థ
  • కానీ రాష్ట్రంలో ACB నీ బంది చేశారు.
  • పంజరంలో చిలక మాదిరిగా బంధి చేశారు
  • TDP పంజరంలో ACB బందీ అయ్యింది
  • ACB నీ వెంటనే విడుదల చేయండి
  • ఏసీబీ ప్రజల కోసం ఉన్న సంస్థ
  • ఈ లంచాల వ్యవహారాన్ని ఏసీబీ బయట పెట్టాలి
  • ఇప్పటికే రాష్ట్రం నెత్తిన విద్యుత్ చార్జీల భారం మోపారు
  • ఈ డీల్ వల్ల 1.50 లక్షల కోట్ల భారం పడుతుంది
  • చంద్రబాబు గారు..మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి
  • జగన్ తన సొంత ప్రయోజనం కోసం డీల్ చేస్తున్నారు
  • ఆయనకు మీకు తేడా లేదు
  • ప్రజలు కూటమి నీ నమ్మి రాత్రి 9 గంటల దాకా లైన్లో నిలబడి ఓట్లు వేశారు
  • ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి

SAKSHITHA NEWS