శరవేగంగా జరుగుతున్న ఇండోర్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు…,
పనులను నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే..,
రానున్న వేసవికాలం దృశ్య చిన్నారులకు మరి ముఖ్యంగా గృహిణులకు మంగళగిరి నగరంలో మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న ఈతకొలను పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేసి మే నెల నుండి అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు.
వేసవి కాలంలో పెద్దలకు, పిల్లలకు, ఆడవారికి ఉదయం, సాయంత్రం వేలల్లో సేద తీరటానికి, ఆహ్లాదం తో పాటు ఆరోగ్యాన్ని కూడా నగర ప్రజలకు అందిచనున్నట్లు ఎమ్మేల్యే ఆర్కే అన్నారు.
ఇండోర్ స్విమ్మింగ్ పూల్ నిర్మించడం వలన మహిళలలు కూడా నిర్ణీత సమయాలలో స్విమ్మింగ్ చేసుకోవటానికి వెసులుబాటుగా ఉంటుందని అన్నారు.
ఇప్పటికే నగరంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక పనులు జరుగుతుండగానే, ఆటవిడుపు మరియు ఆహ్లాదానికి సంబంధించిన ఇటువంటి పనులకు పూనుకున్న ఎమ్మెల్యే ఆర్కే కు నగర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.