సైబరాబాద్ లో నూతన బ్యారెక్ ల ప్రారంభం*

Spread the love

సాక్షిత : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో నూతన బ్యారెక్ లను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాష్ మహంతి, ఐపీఎస్., తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది సౌకర్యార్థం ఇదివరకు ఉన్న బ్యారెక్ లకు అనుబంధంగా అధునాతన సౌకర్యాలతో మూడు నూతన బ్యారెక్ లను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభించామన్నారు.

ఈ బ్యారెక్ లలో స్టోరేజ్ బెడ్స్, రిసెప్షన్, వ్యక్తిగత సెక్యూరిటీ లాకర్లు, కూలర్లు, డైనింగ్, వాష్ రూమ్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి.

సీపీ వెంట.. సైబరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్) సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వార్, ఐపీఎస్., డీసీపీ అడ్మిన్ యోగేష్ గౌతమ్, ఐపీఎస్., బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, ఐపీఎస్., W&CSW డీసీపీ శ్రీమతి నితిక పంత్, ఐపీఎస్., డీసీపీ సైబర్ క్రైమ్స్ శ్రీమతి రితి రాజ్, ఐపీఎస్., EOW డీసీపీ శ్రీ ప్రసాద్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ శ్రీ J. SK షమీర్, ఏడీసీపీ CSW శ్రీనివాస్ చౌదరీ, ఏసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ ఇంద్రవర్ధన్, ఏసీపీ (హోమ్ గార్డ్స్) శ్రీ కృష్ణ, ఏసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ మట్టయ్య, ఆర్ఐ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ హిమకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page