సావిత్రిబాయిపూలే జ్యోతిరావుపూలే విగ్రహాల ఆవిష్కరణ.

Spread the love


Inauguration of idols of Savitribaipule and Jyotirapulee.

సావిత్రిబాయిపూలే జ్యోతిరావుపూలే విగ్రహాల ఆవిష్కరణ.

సాక్షిత నంద్యాల జిల్లా

సావిత్రిబాయి పూలే జయంతి రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని యస్సీ,యస్టీ , బిసి , మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్ పట్నం రాజేశ్వరి.


ఘనంగా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ.
సావిత్రిబాయి పూలే జయంతి రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి.
నేడు నంద్యాల జిల్లా పాణ్యంలోని స్ధానిక మోడల్ పాఠశాలలో విగ్రహాల ఆవిష్కర
నేడు యస్సీ, యస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక ,

రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్ అధ్యక్షతన నంద్యాల జిల్లా పాణ్యం మండలం మోడల్ స్కూల్ నందు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి బాయిపూలేల నూతన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి – మహాత్మ జ్యోతిబాపూలే , సావిత్రి బాయిపులే విగ్రహాల దాత నక్కలమిట్ట శ్రీనివాసులు,రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ర్వఫ్ ) రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు , పాణ్యం ఎంఆర్ఓ మల్లిఖార్జున రెడ్డి , సుగాలిమెట్ట సర్పంచు దేవి బాయి , విద్యార్ధి సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్ , ర్వఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్ ,

ర్వఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తిని ప్రతాప్ , షేక్ రియాజ్ , ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనం వెంకటాద్రి , కేజే. శ్రీనివాసరావు , పాణ్యం ఎంఈఓ కోటయ్య , ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనారిటీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, మహిళా ఐక్యవేదిక నంద్యాల జిల్లా సభ్యులు కటికే భాను,ముడియం సునీత, పెద్దక్క,మైనార్టీ నాయకులు అన్వర్ హుస్సేన్ ,

మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ వీరేష్ , ర్వప్ ఫజిల్లా అధ్యక్షులు విక్రమ్ , ర్వఫ్ బాలకృష్ణ నాయక్ , కరుణాకర్ ప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు.అనంతరం మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రి బాయిపూలే జ్యోతిబా పూలేల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు.

చదువుల తల్లి సావిత్రిబాయిపూలే జయంతి రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఆమె కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విగ్రహ దాత నక్కల మిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుపూలే సావిత్రిబాయిపూలే విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందించదగ్గ మంచి కార్యక్రమమని, విద్యార్థులు పూలే ఆలోచనలతో ఆ మహనీయుల అడుగు జాడల్లో నడిచి వారి భవిష్యత్తుని ఉన్నతంగా మార్చుకోవాలని ఆయన అన్నారు.

ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుని ఆ స్ఫూర్తితో ప్రతి బహుజన బిడ్డ మరియు విద్యార్థులు ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.అనంతరం స్కూల్ మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రములో విద్యార్ధినీ , విగ్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page