చలో మైదాన్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Spread the love

హజరైన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ నివాస్ గౌడ్

శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

విజయ వంతం చేయాలని పిలుపు

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలోf FC భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవార్థం వారి పుట్టిన రోజైన ఆగష్టు 29 న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) అధ్వర్యంలో ‘చలో మైదాన్’ పేరుతో రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు.

చలో మైదాన్ పేరిట నిర్వహిస్తున్నా క్రీడా అవగాహన సభల ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ క్రీడ దినోత్సవమును ఘనంగా నిర్వహించాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు , మాజీ కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాల చారి, గిరిజన సహకార సంస్థ చైర్మన్ వాల్య నాయక్, ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ K. లక్ష్మి,, మల్లు వెంకట నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page