వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం అప్పాపురం గ్రామం నందు నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ ల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వారితో పాటుగా నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. గ్రామం లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ లను ఏర్పాటు చేయటం తో పాటు సంక్షేమ పథకాలను కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటి ముందుకే తీసుకొనిస్తున్నారు అని తెలిపారు. ఇలాంటి సంక్షేమం లో ప్రభుత్వం ముందుకు వెలుతుంటే, ప్రతిక్షణం వారు ప్రభుత్వ పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామం లోనే రైతుల కోసం రైతు భరోసా కేంద్రం, ప్రజల ఆరోగ్యం కోసం వైయస్సార్ హెల్త్ క్లీనిక్ ను ప్రారంభోత్సవ చేసుకోవటం సంతోషకరమని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపాలని కోరారు. ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుటికి ప్రతిపక్షం వారు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. ఇక్కడ ఉన్న బురిడి గారు ప్రజలను అనేక రకాల మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని, వారి బురిడీ లకి లోంగే ప్రజలు ఎవరూ లేరని గుర్తుపెట్టు కోవాలని ప్రతిపక్ష నేతకు తెలియజేశారు. అభివృద్ధి పై అసత్య ప్రచాలు చేసేమీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరుచేసిన అభివృద్ధి ఏది అని ప్రశ్నించారు. మీ పాలనలో జన్మభూమి కమిటీల పేరు తో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం మీది కాదా అని నిలదీశారు. ఆనాడు ప్రజలు సాగు నీటి కోసం అల్లాడిపోయిన పరిస్థితి మీకు గుర్తులేదా? ఇవాళ అలాంటి పరిస్థితి లేదని సగౌరవం గా చెప్పుకుంటున్నాము. అగ్రహార రైతుల భూములను సర్వే చేయించి, వారికి పట్టాలను కూడా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని, ఎన్నో ఏళ్ల రైతుల కలను నెరవేర్చాలని తెలిపారు.