LED లైట్స్ ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు

Spread the love

మోడల్ సిటీ లాగా అభివృద్ధి చెందుతున్న నూజండ్ల

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండల కేంద్రం అయిన నూజండ్ల గ్రామం నందు మెయిన్ రోడ్ నందు డివైడర్ ను పై LED లైట్స్ ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ, మోడల్ సిటీ గా నూజండ్ల గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. గ్రామం లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ లను ఏర్పాటు చేయటం తో పాటు సంక్షేమ పథకాలను కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటి ముందుకే తీసుకొనిస్తున్నారు అని తెలిపారు. ఇలాంటి సంక్షేమం లో ప్రభుత్వం ముందుకు వెలుతుంటే, ప్రతిక్షణం వారు ప్రభుత్వ పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Related Posts

You cannot copy content of this page