తిరుమల కుంట కాలనీలో ఆదివాసి గిరిజనుల భూమి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు
అశ్వారావుపేట, ఏప్రిల్ (సాక్షిత న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని తిరుమల కుంట గ్రామపంచాయతీ లో గల తిరుమలకుంట కాలనీలో భూమి పండగ ను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పండగలో పెద్దలు పిల్లలు అందరూ పాల్గొని ఆటపాటలతో సంతోషంగా నిర్వహిస్తారు
భూమి పండుగ యొక్క విశిష్టత
ఆదివాసి గిరిజనులు తరతరాలుగా ఈ పండగను వారి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి నిర్వహిస్తూ ఉంటారు ఈ భూమి పండగ అనేది ఆదివాసి గిరిజన రైతులకు చాలా ముఖ్యమైనది ఈ పండగ చేసిన తర్వాతనే వారి యొక్క పొలాలలో విత్తనాలను నాటకం జరుగుతుంది పండగ చేసిన తర్వాత నే వారి యొక్క భూమిలో విత్తనాలను వేసి పంట యొక్క ఫలాలను అనుభవిస్తారు ఈ పండగ చేస్తేనే వారికి కలిసి వస్తుందని వారి యొక్క నమ్మకం పండగ చేయకపోతే వారు భూమిలో ఒక్క విత్తనం కూడా నాటడం జరగదు ఈ పండగను ఆదివాసి గిరిజన రైతులు ఐదు రోజులు జరుపుకుంటారు ఆదివాసి గిరిజన రైతుల ముందుగా వాళ్ళు ఎంచుకున్న చోట ఒక గొయ్యి తీసి అక్కడ పూజా కార్య క్రమాలు నిర్వహిస్తారు గొయ్యి దగ్గర ఆదివాసి గిరిజన రైతుకు సంబంధించిన నాగలికి కట్టే తాళ్లు ముల్లకర్ర నవధాన్యాలు పెట్టి పూజలు నిర్వహిస్తారు ఒక పందిని కొనుక్కొని దానిని ఊరు పొలిమేర చుట్టూ తిప్పుతూ మూడుసార్లు తిరుగుతారు తిరిగిన తర్వాత దానిని ఆ గొయ్యి దగ్గర వండుకొని ఊరు వాళ్ళందరూ పిల్లలు పెద్దలు ఆడవాళ్ళ అందరూ కలిసి అక్కడే భోజనం చేస్తారు చేసిన తర్వాత ఆ గోతిలోనే పారపోస్తారు చేతులు గిన్నెలు, గోతు లోనే కడుగుతారు మగవాళ్ళందరూ అడవులకు వేట కు వెళతారు ఆడవాళ్లు గొయ్యి తవ్విన కాడ రోడ్డుమీద వచ్చే వాళ్లను వెళ్లే వాళ్లను ఆపుతూ వాళ్లకు తోచినంత ఇవ్వమని అడుగుతారు ఈ ఆచారం తరతరాల నుండి వస్తున్న ఆదివాసి గిరిజనుల ఆచారం అడవికి వెళ్లేవాళ్లు ఆదివాసి గిరిజనుల ఆయుధమైన విల్లు బాణాలు పట్టుకొని అడవులకు వెళతారు అడవి నుండి దేనినైనా కొట్టుకొని తీసుకువచ్చి అదే గొయ్యి దగ్గర వండుకొని ఊరు ప్రజలు పిల్లలు పెద్దలు ఆడవాళ్లు ముసలి వాళ్లు అక్కడే భోజనం చేసి ఆ గొయ్యిని మూసివేస్తారు దానితో పండగ పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క పొలాల దగ్గర శుభ్రం చేసి దున్నించి విత్తనాలు వేయడం జరుగుతుంది ఇది ఆదివాసి గిరిజనులకు తరతరాల నుండి వస్తున్న ఆచారం ఈ పండగలో పిల్లలు పెద్దలు ఆడవాళ్ళందరూ సంతోషంగా పాల్గొంటారు.