SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డులో గల ZPHS స్కూల్ లో శ్రీ అల్లూరి సీతారామరాజు జ్ఞాపకార్థం క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులకు 92 మందికి ఎగ్జామ్ ప్యాడ్, జామెంట్రీ బాక్స్, పెన్నులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సాయి కుమార్ తో కలిసి అందజేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిదని పట్టుదల క్రమశిక్షణ అలవర్చుకొని శ్రద్ధగా చదువుకొని పదవ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మస్తైర్యంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, మంచి మార్కులతో విజయాలను అందుకోవాలని అన్నారు. విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

WhatsApp Image 2024 02 29 at 4.09.40 PM

SAKSHITHA NEWS