SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరన్న గెలిస్తేనే భద్రాచల ప్రాంతం అభివృద్ధి చెందుతుంది….

పొదెం వీరన్న ఆంధ్రలోకి వెళ్లిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి భద్రాచల ప్రాంతం అభివృద్ధి చేయమని సీఎంని అసెంబ్లీ సాక్షిగా కోరాడు….

కానీ ఆ దిశగా వరకు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు….

ఐదు పంచాయతీలు తీసుకురావడం మాట దేవుడెరుగు, ఉన్న ఒక్క పంచాయతీని మూడు ముక్కలు చేస్తూ జీవో తీసుకొచ్చారు….

ఇదేనా భద్రాచలం కి మీరు చేసే అభివృద్ధి BRS నాయకులారా….

ఈ BRS నాయకులు మాయమాటలు చెప్పే ఓట్లు అడిగితే మేము వేస్తామా….

భద్రాచల ప్రజల సమస్యలపై పట్టింపు లేని పట్టణ BRS పార్టీ మాకు వద్దు,ప్రజా సమస్యలను తీర్చగల కాంగ్రెస్ పార్టీ ముద్దు అంటున్న ప్రజలు….

కాంగ్రెస్,టిడిపి,సీపీఐ, తెలంగాణ జన సమితి మిత్రపక్ష కూటమి నాయకుల నేతృత్వంలో కూనవరం రోడ్డులోని స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం దగ్గర నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది….

146,147,148,149 పోలింగ్ బూత్ ఏరియలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతినగర్ ఏరియాలోని గడప,గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీ ల గురించి వివరించి…..

అధికార పార్టీ ఇచ్చే కోట్ల రూపాయలకు ఆశపడి జిల్లాలో ప్రతి ఒక్క శాసనసభ్యుడు అధికార పార్టీకి అమ్ముడు పోతే…..

మనం వేసిన ఓటుకి వీలివఇచ్చి, ఈ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చడానికి పొదెం వీరయ్య ప్రభుత్వంతో పోరాడాడు తప్పించి వాళ్ళు ఇచ్చే కోట్ల రూపాయలకు ఏనాడు అమ్ముడుపోలేదు.

నీతిగా నిజాయితీగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య గారి ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి ఆయనను గెలిపించుకోవడం ద్వారా భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని ఎన్నికల ప్రచారంలో నాయకులు ప్రజలకు వివరించారు.

భద్రాచల ప్రాంతానికి డంపింగ్ యార్డ్ కూడా స్థలం లేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.ఆంధ్రాలోకి వెళ్లిన ఆ ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి భద్రాచల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ని అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ శాసనసభ్యుడిగా పొదెం వీరయ్య ఎన్నోమార్లు అడిగాడు….

అదే అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి ఎందుకు ప్రయత్నిస్తానని చెప్పి ఇప్పటికీ నాలుగేళ్లు అవుతుంది.

వీరి స్వార్థ ప్రయోజనాల కోసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను కలుస్తున్నారు కానీ,భద్రాచల ప్రాంత అభివృద్ధి కోసం ఐదు పంచాయతీలను తిరిగి తీసుకువచ్చేందుకు మాత్రం వీలు నోర్లు తెరవడం లేదు, కాళ్లు కదప లేదు.

పైగా ఇక్కడి ప్రజల అభిప్రాయం కానీ, ఇక్కడి శాసనసభ్యుడి అభిప్రాయం కానీ తీసుకోకుండా, ఒకటే పంచాయతీగా ఉన్న భద్రాచలం ప్రాంతాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ అసెంబ్లీ సాక్షిగా GO ని తీసుకొచ్చారు.

భద్రాచలం విషయంలో మేము చేసింది చట్టం,మేము చెప్పింది న్యాయమంటూ ఈ BRS నాయకుల వైఖరి ఈ నిర్ణయంతో బయటపడింది.

ఇప్పటికైనా భద్రాచలం ప్రజలు ఈ పదేళ్ల బిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు నడుం బిగించాలి.
భద్రాచల ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేసిన BRS నాయకులకు బుద్ధి చెప్పేందుకు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీసి నిలబడిన పొదెం వీరయ్య ఎన్నికల గుర్తు హస్తం గుర్తు పై ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి.

BRS పాలన అంతానికి తొలి అడుగు భద్రాచలం నియోజకవర్గం నుంచి వెయ్యాలని కోరుకుంటున్నామని ప్రజలకు వివరించారు.

ఈ ఎన్నికల ప్రచారంలో….

టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతరేల రవికుమార్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బలుసు నాగ సతీష్,టిడిపి నాయకులు కొడాలి శ్రీనివాస్,చాలా రాజారాం,ఎస్.కె అజీమ్, తాళ్లూరి చిట్టిబాబు,మాజీ సర్పంచ్ భూక్య శ్వేత, భూక్య వీరన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డిపట్ల సత్య లింగం, ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతల సుధీర్,యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్,రాగం సుధాకర్,మహిళా కాంగ్రెస్ నాయకులు బొంత రమణ,రూపా దేవి,టిడిపి మహిళా నాయకులు అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 17 At 6.13.33 Pm

SAKSHITHA NEWS