If Jaya Jayahe Telangana song is sung in Keeravani, we will stop it: Bolka Venkat Yadav, OU Nagesh warn
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జయ జయహే తెలంగాణ గీతం తెలంగాణ సంగీత దర్శకులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది తెలంగాణ కళాకారుల తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ల ఎంతో మంది వున్నారు తెలంగాణ కవులను, కళాకారులను అవమానించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులని తెలంగాణ ఉద్యమకారులు ఇంకా 2009 నుంచి 2014 వరకు తెలంగాణ పల్లెలలో వీళ్ళని తిరుగనివ్వలేదని గుర్తుచేశారు.
తెలంగాణ ద్రోహులు గా మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోంవాలని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క పాటగాని మాట గాని పాటకు సంగీతం గాని ఈ ఆంధ్ర కళాకారులు గాని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ గాని చేయలేదు మా తెలంగాణలో అంతకన్నా అద్భుతమైన సంగీతాన్ని అందించే సంగీత దర్శకులు ఉన్నారని అంతకన్నా రచించే వ్యక్తులు ఉన్నారని ఇంకెన్నాళ్లు ఆంధ్ర వారికి ఊడిగం చేస్తూ జీవిస్తారు అన్నారు.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మట్టిలో తొక్కుతు ఆంధ్ర నాయకుల చెప్పులు మోసే నాయకుల చేతిలో మళ్ళీ మోసపోవడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వీరేష్, మస్కాపురం ప్రవీణ్, సందీప్, దిలీప్, రాజు ,శంకర్, మధు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
epaper Sakshitha
Download app