గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలే..
తెలంగాణ వచ్చాకే అన్నదాతలకు పెద్దపీట..
గొల్లపల్లి, ఈర్లపల్లి, తాండలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు.
జోగులాంబ టీవీ ప్రతినిధి,జడ్చర్ల: జడ్చర్ల నమండలం గొల్లపల్లి, ఈర్లపల్లి, తాండలో ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
అవ్వాలను, అడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటి ప్రచారం చేపడుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రంలోని సంక్షేమ పథకాలను అందరికి వివరిస్తూ మళ్ళీ వచ్చే కేసీఆర్ ప్రభుత్వంలో పెన్షన్లు, రైతుబంధులను పెంచుతామని తెలిపారు. సౌభాగ్యలక్ష్మీ పధకంలో మహిళలకు 3000 జీవనభృతి అందిస్తామని తెలిపారు.
కనీసం 5 గంటల కరెంటు కూడా సక్రమంగా సరఫరా చేయకుండా అన్నదాతలను ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా… నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను అందజేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం కావాలా అని రైతులు ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరారు.
పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులే పునరావృతం అవుతాయని ప్రజలు ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు. కరెంట్ ఎప్పుడు వస్తది ఎప్పుడు పోతదో తెలియక పొలాల కాడే పడిగాపులు కాస్తూ అన్నదాతలు ఎన్ని అవస్థలు పడ్డారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. నేడు ఆ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని రైతులను అడిగారు.
ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు మీ ముందే ఉన్నాయి. ప్రతి ఇంటికి సంక్షేమం చేరిందా లేదా అని మిరే ఒక్కసారి ఆలోచించాలని కోరారు. మంచి చేసిన ప్రభుత్వానికి అండగా ఉండాలని, మంచి చేసిన ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలని కోరుతూ కారుగుర్తుకే ఓటేసి భారీ మెజారిటీ అందిచాలని ప్రజలను అభ్యర్థించారు.