మీరంతా గర్వపడేలా తిరుపతిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .
స్థానిక 8వ వార్డు మునిశేఖర్ రాయల్ మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి నగరాభివృద్ధి గురించి అందరూ మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చాం, పక్క జిల్లాల ప్రజలు కూడా తిరుపతిలో జరిగిన అభివృద్ధిని చూసి మెచ్చుకుంటున్నారు.
వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే ప్రజలు రోడ్లను చూసి ఆశ్చర్యపోతున్నారు, గతంలో కంటే ప్రస్తుతం నగరం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం సంతోషంగా ఉంది.
ఇలాగే మన తిరుపతి గురించి గొప్పగా మాట్లాడుకోవాలంటే మరింత డెవలెప్ చేయాలి. రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా నిలపాలి.
అందుకు మీఅందరి మద్దతు నాకు కావాలి, రాబోయే ఎన్నికల్లో మీ ఓటు నాకు వేసి అండగా నిలబడితే మీరంతా గర్వపడేలా తిరుపతిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను.