మహబూబ్ నగర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ను లక్ష్మమ్మ అనే చాటుకుని ఆప్యాయంగా పలకరించారు. ఆమె సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకునేందుకు వచ్చిందని భావించిన మంత్రి… ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా పని ఉందా అని లక్ష్మమ్మను అడిగారు. ఇప్పటికే మా కుటుంబానికి అన్ని సమకూర్చారని… నాకేమీ వద్దని మీ చల్లని పలకరింపు చాలని అందామె. వేలాది మంది రైతులకు ఉపయోగపడేలా, వందలాదిమంది కూలీలకు ఉపాధినిచ్చేలా మార్కెట్ యార్డును తీర్చిదిద్దారని, తాను 3 సార్లు అనారోగ్యం బారిన పడినప్పుడు ఆదుకుని బాగాయ్యేలా చేశారని మంత్రికి తెలిపారు. తన కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడంతో పాటు తనకు పింఛన్ కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. మార్కెట్ బాగుందని మాలాంటి వాళ్లకు ఉపాధి లభిస్తున్నదని తెలిపింది లక్ష్మమ్మ. మంత్రి చేస్తున్న నిరంతర ప్రజాసేవకు లక్ష్మమ్మ ఒక ఉదాహరణ మాత్రమేనని మార్కెట్ యార్డ్ కు వచ్చిన రైతులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
నాకేమీ వద్దు మీ పలకరింపు చాలు.
Related Posts
వచ్చే ఏడాది జనవరి 3 న,నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
SAKSHITHA NEWS వచ్చే ఏడాది జనవరి 3 న,నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హైదరాబాద్:బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే ఏడాది జనవరి 3 కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.…
ప్రభుత్వభూమి అని తెలిసికూడా కబ్జాను అరికట్టకపోవడం దారుణం
SAKSHITHA NEWS ప్రభుత్వభూమి అని తెలిసికూడా కబ్జాను అరికట్టకపోవడం దారుణం.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం జోన్ జగత్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప షాపింగ్ కాంప్లెక్స్ కోసం ప్రస్తుతం రేషన్ షాప్ వద్ద స్థలం కేటాయిస్తే…