నాకేమీ వద్దు మీ పలకరింపు చాలు.

Spread the love

మహబూబ్ నగర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ను లక్ష్మమ్మ అనే చాటుకుని ఆప్యాయంగా పలకరించారు. ఆమె సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకునేందుకు వచ్చిందని భావించిన మంత్రి… ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా పని ఉందా అని లక్ష్మమ్మను అడిగారు. ఇప్పటికే మా కుటుంబానికి అన్ని సమకూర్చారని… నాకేమీ వద్దని మీ చల్లని పలకరింపు చాలని అందామె. వేలాది మంది రైతులకు ఉపయోగపడేలా, వందలాదిమంది కూలీలకు ఉపాధినిచ్చేలా మార్కెట్ యార్డును తీర్చిదిద్దారని, తాను 3 సార్లు అనారోగ్యం బారిన పడినప్పుడు ఆదుకుని బాగాయ్యేలా చేశారని మంత్రికి తెలిపారు. తన కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడంతో పాటు తనకు పింఛన్ కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. మార్కెట్ బాగుందని మాలాంటి వాళ్లకు ఉపాధి లభిస్తున్నదని తెలిపింది లక్ష్మమ్మ. మంత్రి చేస్తున్న నిరంతర ప్రజాసేవకు లక్ష్మమ్మ ఒక ఉదాహరణ మాత్రమేనని మార్కెట్ యార్డ్ కు వచ్చిన రైతులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page