రానున్న రోజుల్లో మన జీవకోనని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా అని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే

Spread the love

రానున్న రోజుల్లో మన జీవకోనని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా అని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .

స్థానిక జీవకోన అంబేద్కర్ సర్కిల్‌లో స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా జీవకోన రోడ్డును ఎంత విస్తరణ చేయగలిగాము, అలాగే విద్యుత్ దీపాలంకరణతో సుందరీకరించాం, ఎన్నడూ మౌలిక సదుపాయాలు కల్పించి అండగా ఉన్నాం, మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని భరోసా ఇచ్చాం.

రానున్న రోజుల్లో సత్యనారాయణపురం సర్కిల్ నుంచి బైపాస్ రోడ్డుకి వెడల్పుగా రోడ్ వేసి స్థానిక ప్రజలకి ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను.

5 ఏళ్ల క్రితం మన తిరుపతి ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది.. మీరే చూస్తున్నారు. పక్క జిల్లాల ప్రజలు ఈర్ష్య పడేలా అభివృద్ధిలో నగరాన్ని పరుగులు పెట్టిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

భవిష్యత్తులో ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని మాట ఇస్తున్నాను.

స్థానికుడిగా మీ సమస్యలు తెలిసిన నాయకుడగిగా రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను.

వారసత్వంగా కాదు నేను చేసి అభివృద్ధి మీకు కనపడితేనే నాకు అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నాను.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page