తిరుపతిని పెద్ద నగరాలతో పోటీ పడేలా చేస్తానని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే

Spread the love

తిరుపతిని పెద్ద నగరాలతో పోటీ పడేలా చేస్తానని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .


సాక్షిత : స్థానిక భైరగపట్టేడ్ లో వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మీ అందరూ గమనిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా నగరంలో ఈ విధంగా అభివృద్ధి పనులు జరిగాయా..? గత నాయకులు స్వార్ధపూరిత రాజకీయాలతో అభివృద్ధిని గాలికొదిలేశారు.
కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజు నుంచి నా తిరుపతి డెవలప్ కావాలని పనిచేస్తున్నాను. ఇందులో భాగంగా మాస్టర్ ప్లాన్ రోడ్స్ నిర్మించి నగర రూపురేఖలు మార్చాం. అలాగే రానున్న రోజుల్లో మన తిరుపతిని స్మార్ట్ సిటీలతో పోటీ పడేలా చేస్తానని మాటిస్తున్నాను.

Related Posts

You cannot copy content of this page