ఇన్ని కుటుంబాలు భాగుపడ్డాయంటె ఆనందంగా వుంది ఎమ్మెల్యే

Spread the love
I am happy that so many families have participated - MLA Bhumana

ఇన్ని కుటుంబాలు భాగుపడ్డాయంటె ఆనందంగా వుంది – ఎమ్మెల్యే భూమన


సాక్షిత తిరుపతి : మత్తులో నుండి బయటపడి ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయంటే నిజంగా చాలా ఆనందంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెనడీ నగర్ లోని మత్తు పదార్థాల నిర్మూలన కేంద్రం, డి అడిక్షన్ సెంటర్ ని ప్రారంభించి ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ కేంద్రంలో మత్తు నుంచి బయటపడ్డ వ్యక్తులతో జరిగిన కార్యక్రమంలో

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు పాల్గొన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ మత్తుకు అలవాటు పడి తమ ప్రాణాలతో పాటు తమ కుటుంబాలను కూడా హరిస్తున్నటువంటి వ్యక్తులను కొంతమేరకైనా బాగుపరచాలనే లక్ష్యంతో డి అడిక్షన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.

ఇప్పటివరకు ఈ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ పొంది, చికిత్సలు తీసుకొని పూర్తిగా మత్తు వ్యసనాల నుంచి దూరమై, తాను బాగుపడడమే కాకుండా తమ కుటుంబాలను నిలబెట్టుకుంటున్న వారందరికీ తన ప్రత్యేక అభినందనలన్నారు. ఈ సెంటర్ ద్వారా మత్తు నుండి బయటపడిన వ్యక్తుల మాటలు వింటుంటే చాలాకాలం తర్వాత ఒక గొప్ప అనుభూతి కలుగుతున్నదన్నారు.

మంచిగా మార్పు చెందిన మీరు ఈ సమాజంలో గతంలో మీలాగా ఉన్న వారందరికీ కౌన్సిలింగ్ ఇప్పించి, చికిత్స అందించేందుకు తోడ్పాటు అందించి, వారిని కూడా మంచి ప్రయేజకులను చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే భూమన కోరారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏ మున్సిపలిటిలో లేనటువంటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి యొక్క గొప్ప ఆలోచనతో రూపొందించిన డి అడిక్షన్ సెంటర్ ద్వారా అనేక కుటుంబాలు బాగుపడ్డాయన్నారు.

ఇంకా కూడా కార్పొరేషన్ తరపున మరింత చొరవతో ఎన్ని వందల మందికైనా ఈ మత్తు నుండి బయటపడేందుకు తమ తోడ్పాటు అందిస్తామన్నారు. నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆకాంక్షతో ఏర్పడినటువంటి ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 215 మందికి కౌన్సిలింగ్ తో చికిత్సలు అందించడం జరిగిందని, టెలీపోన్ ద్వారా 131 మందికి సలహాలు, సూచనలు చేయడం జరిగిందన్నారు.

స్టాండింగ్ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ ఎస్కే బాబు మాట్లాడుతూ తిరుపతి నగరంలో మత్తుకు బానిసలై తమ తల్లిదండ్రులను, కుటుంబాలను ఇబ్బందులు పెడు పడుతున్న యువతను చూసి చలించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మెదడులో పుట్టిన ఆలోచన ఫలితమే ఈ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు జరిగిందన్నారు. అనేక కుటుంబాలను మత్తు నుండి దూరం అభివృద్దిలోకి తీసుకొచ్చిన గణత ఎమ్మెల్యే భూమనకే దక్కిందన్నారు.

కొంతమంది మత్తు వ్యసనం వలన తమ జీవితాలు నాశనం అయ్యే దశలో ఈ డి అడిక్షన్ సెంటర్ వలన ఏ విదంగా చికిత్స తీసుకొని ఆ మత్తు నుండి బయటపడి, నేడు చక్కగా జీవిస్తున్నామనే విషయాలను తెలుపుతూ, ఎమ్మెల్యే భూమనకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోటూరి ఆంజనేయులు, డి అడిక్షన్ సెంటర్ డాక్టర్ ఆశా, సెంటర్ కౌన్సిలర్స్ షకీలా, పవన్, సిస్టర్ కవితా, శానిటరి సూపర్ వైజర్ సుమతీ, నాయకులు తాళ్ళూరి ప్రసాద్, శ్యామల, బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page