తెలంగాణకు నేను తోబుట్టును: గవర్నర్ తమిళి సై

Spread the love

హైదరాబాద్
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాజ్‌భవన్‌లో రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జిర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్మడ్ ఫోర్సెస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రెడ్ క్రాస్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు… ప్రజలంతా రక్షా బంధన్ జరుపుకుంటున్నారన్నారు. దేశంలో ఎన్నో సంస్కృతులు… ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ..అంతా కలిసి మెలిసి ఉంటామని.. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదన్నారు.

సోల్జర్స్ వల్లే మనం ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నామని, రాఖీ కట్టి వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుందామని తమిళిసై అన్నారు. దేశం ఈరోజున ఇలా ఉండటానికి కారణమైన సైనికుల గురించి యూత్ తెలుసుకోవాలన్నారు.

మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదని.. అభివృద్ధి చెందిన దేశమని అన్నారు. చంద్రుని వరకు వెళ్ళిన మనం ఇప్పుడు సూర్యుని దగ్గరకి కూడా వెళ్ళబోతున్నామన్నారు. తెలంగాణకు తానొక తోబుట్టువునని, రాజ్‌భవన్‌లో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తాను రాఖీ కడుతున్నానని.. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు………..

Related Posts

You cannot copy content of this page