నేడు ఆ 6 జిల్లాలో భారీ వర్షాలు..! హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం విదితమే. గురువారం రోజు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం రోజు వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది. శనివారం రోజు నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నేడు ఆ 6 జిల్లాలో భారీ వర్షాలు..!
Related Posts
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన
SAKSHITHA NEWS అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ –…
తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ
SAKSHITHA NEWS తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వర్ణాంధ్ర విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్-2047 ఈ లక్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం…