జీడమెట్ల పారిశ్రామిక వాడలోని కెమికల్ కంపెనీ లో భారీ అగ్ని ప్రమాదం

Spread the love

స్లగ్ః
యాంకర్ః జీడమెట్ల పారిశ్రామిక వాడలోని కోపల్లె పార్మా కెమికల్ పరిశ్రమ (కంపెనీ) లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది..
గడిచిన కొన్ని నెలలుగా మూతపడి ఉన్న పరిశ్రమలో ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం పరిసర ప్రాంతాల వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది..

గతంలో నిషేదిత డ్రగ్స్ తయారుచేస్తు పట్టుబడ్డ పరిశ్రమ,కంపెనీ క్రిందనుండి వ్యర్ధ రసాయానాలను నాలలోకి వదులుతున్నారన్న సమాచారం మేరకు పిసిబి,ఫైర్ సిబ్బంది కంపెనీ ని సీజ్ చేశారు. కంపెనీ (ప్లాంట్ )మొత్తం 8నుండి 10ఎకరాలలో విస్తరించుందని కంపనీ క్రింద సైతం వ్యర్ధరసాయానాల పారబోత,డంపింగ్,సాల్వెంట్స్ డ్రమ్స్ స్టోరేజ్ కారణంగానే ఈ ఫైర్ జరిగుంటుందని,కంపెనీ లో 4 నుండి 6రియాక్టర్స్ సైతం ఉన్నాయని అవి పేలితే పక్కన ఉన్న జనజీవనం అతలాకుతలం అవుతుందని స్థానికులు భయబ్రాంతులకు గురౌతున్నారు…

జీడిమెట్ల, కంపెనీ పరిసరాల్లో కరెంట్ లేకపోవటంతో కారుచీకట్లు కమ్ముకుని,అణిబాంబులవలే పేలుతున్న సాల్వెంట్స్,కంపెనీవద్దకు భయపడి ఫైర్ సిబ్బంది సైతం పోనిపరిస్థితి నెలకొనుంది.
కంపెనీలో సెక్యూరిటీ తో పాటు సిబ్బంది ఎవరైన చిక్కుకోని ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి .

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page