Health Protection for Children of TD Vaccination Deputy DMHO Dr S Jayalakshmi*
టీ.డీ వ్యాక్సినేషన్ పిల్లలకు ఆరోగ్య రక్షడిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి*
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
మొగలిగిద్ద మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూలు (నూర్ కాలేజీలో) ఉన్న ఐదవ తరగతి విద్యార్థిని లు 64 గురి కి, పదవ తరగతి విద్యార్థినులు మందికి, స్కూల్లో మొత్తం విద్యార్థినిలు 130 మందికి ఈరోజు టి డి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమమునకు డిప్యూటీ డిఎంహెచ్ఓ జయలక్ష్మి హాజరై ప్రోగ్రామును పర్యవేక్షించి విద్యార్థినులకు వ్యాక్సినేషన్ గురించి వివరణ ఇచ్చారు మరియు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ పీ నరహరి హాజరై విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి మరియు పోషకాహారం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఆప్తాల్మిక్ ఆఫీసర్ జె శ్రీహరి, పి హెచ్ ఎన్ పుష్పలీల మరియు మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ భార్గవి రెడ్డి, ఏఎన్ఎం వరలక్ష్మి, ఆశాలు, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.
కొందుర్గు కేజీబీవీ స్కూల్ లో టి.డి వ్యాక్సినేషన్
కొందుర్గు మండలం లోని కేజీబీవీ గర్ల్స్ స్కూలు, షాద్నగర్ లో మలయాళ ఆశ్రమం పక్కలో ఉన్న కేజీబీవీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినులకు 62 మందికి టీడీ వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని డాక్టర్ జయలక్ష్మి తెలియజేశారు.
టి అంటే టెటనస్ అని, టెటనస్ వ్యాధి క్లో స్టేడియం టెటనై అనే బ్యాక్టీరియా వలన వ్యాధి సోకుతుంది అని మరియు డి అంటే డిఫ్తీరియా అని, డిఫ్తీరియా వ్యాధి కారినే బ్యాక్టీరియా వలన డిఫ్తీరియా వ్యాధి వస్తుందని తెలియజేశారు. టెటనస్ వ్యాధి మరియు డిఫ్తీరియా వ్యాధి రాకుండా ఉండాలంటే ఐదవ తరగతి విద్యార్థులు మరియు పదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా టి.డి వ్యాక్సినేషన్ వేసుకోవాలని డాక్టర్ జయలక్ష్మి తెలియచేశారు.
తదనంతరం విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి మరియు పోషక హారము గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జై శ్రీనివాసులు తోపాటు, కేజీబీవీ ప్రిన్సిపల్ నిస్సీ మరియు ఎ.ఎన్.యమ్. శిరీష , ఆశలు మరియు స్కూలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.