తిరుపతి నగరములో ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైనదని, ప్లాస్టిక్
నియంత్రణ సరిగా అమలు జరుగుటలేదని పలు పిర్యాదులను అనసరించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు హరిత ఐఏఎస్ ఆదేశాల
మేరకు ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుఖాణాలపై, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుఖాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తెలిపారు. కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాల మేరకు శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి ఆధ్వర్యంలో మునిసిపల్ శానిటరీ ఇన్స్ స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు కలిసి వారి వారి వార్డులందు హోల్ సేల్, రిటైల్ షాపులలో, మర్కెట్స్,
హోటల్స్, వీధి వ్యాపారస్థుల వద్ద తనిఖీ నిర్వహించి వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఉన్న
సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు,నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు 130 కేజిల వరకు స్వాధీనం
చేసుకొని, లక్ష రూపాయాల వరకు జరిమానాలు విదించడం జరిగిందని హెల్త్ ఆఫిసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి తెలిపారు.
ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఉత్పత్తి దారులు, హోల్ సేల్, రిటైల్
షాపులు, సూపర్ మర్కెట్స్, హోటల్స్, వీధి వ్యాపారస్థులు ఇకపై సింగల్ యూజ్ ప్లాస్టిక్
ఉత్పత్తులు, 120 మైక్రాన్ లోపు క్యారీ బ్యాగులు, నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు ఉత్పత్తి
చేయరాదని, నిల్వచేయరాదని, అమ్మరాదు ఆలా చేసినట్లయితే వరుసగా మొదటిసారి రూ
5000/- లు రెండవ సారి రూ. 15000/- లు మూడవసారి రూ.25000/- లు, ఉత్పత్తి
దారులకు నిలువ, అమ్మకం చేసినవారికి మొదటిసారి రూ. 1000/- లు రెండవసారి రూ
5000/- లు మూడవసారి రూ. 10000/- విధించి మూడవసారి రూల్స్ అతిక్రమించిన వారి
ట్రేడ్ లైసెన్స్ ను రద్దు చేసి వారి యొక్క షాపును మూసివేయబడునని హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తెలియజేసారు