SAKSHITHA NEWS

గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్ మృతి?

మంచిర్యాల జిల్లా:
విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్ మృతి చెందిన విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో సాయంత్రం చోటు చేసుకుంది,

వివరాల్లోకి వెళ్తే.. మామిడి పల్లి కీ చెందిన లచ్చన్న చెన్నూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో హఠాత్తు గా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు

గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతన్ని మంచి ర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app