
రేవంత్‌ను తిట్టడం, తిట్టించడం – ఇదే బీఆర్ఎస్ పోరాటం !
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడటం కన్నా రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా పోరాడటమే తమ టార్గెట్ అన్నట్లుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఉన్నారు. నేరుగా రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఆయనే కాంగ్రెస్ పార్టీకి బలం కాబట్టి అలా చేస్తున్నారని అనుకుందాం. అయితే రేవంత్ పై చేస్తున్న ఆరోపణలు మాత్రం రొటీన్ గా ఉంటున్నాయి. ఆయనను ప్రజలంతా తిడుతున్నారు.. మరొకరు అయితే ఆత్మహత్య చేసుకునేవారు.. వ్యతిరేకత విపరీతంగా పెరిగింది..త మళ్లీ వచ్చేది మేమే..ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారని చెప్పడమే పోరాటం అయిపోయింది.
రోజూ చెప్పిందే చెబుతున్న కేటీఆర్
కేటీఆర్ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్నారు. ఆ ప్రసంగాల్లో మార్పేమీ ఉండదు. రేవంత్ రెడ్డి పై తనకు ఉన్న కోపం మొత్తం చూపిస్తూ ఉంటారు. మాట్లాడితే రాష్ట్రంలోని ప్రజలు రేవంత్ రెడ్డిని తెలుగు భాషలో ఉన్న తిట్లన్ని తిడుతున్నారని చెబుతూ ఉంటారు. మరొకరు అయితే ఆత్మహత్య చేసుకునేవారని చెబుతూంటారు. ఈ మాటలు ఎదుట వినేవారికి కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగ

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app