పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహారించుకోవాలి – గూడూరి ఎరిక్షన్ బాబు

Spread the love

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహారించుకోవాలి, కరెంటు కోతలను తగ్గించాలి – గూడూరి ఎరిక్షన్ బాబు

యర్రగగొండపాలెం పట్టణంలోని 132/33 KV విద్యుత్ సబ్ స్టేషన్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, సీనియర్ నాయకులు మన్నే రవీంద్ర గారు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
జగన్ రెడ్డి లూఠీ, అవినీతి కారణంగా విద్యుత్ వినియోగదారులపై రూ.57,188 కోట్ల భారాలు మోపారన్నారు.

క్విడ్ ప్రోకోలకు ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో వాటి సామర్థ్యం మేరకు ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేయడంలేదన్నారు.

జగన్ బినామీ ప్రయివేటు విద్యుత్ సంస్థల వద్ద కమీషన్లకు అధిక రేట్లకు విద్యుత్ కమీషన్ల కోసం కృత్రిక కొరత సృష్టిస్తూ బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు రూ.12 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు. అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్ వద్ద రూ.60వేలు ధర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు రూ. 1.30 లక్షలకు ఎందుకు కొంటున్నారన్నారు.

నాసిరకం పరికరాల వల్లే థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ బ్రేక్ డౌన్లు- సాంకేతిక లోపంగా కలరింగ్ కూకట్ పల్లిలో 11 ఎకరాలు హిందుజా నుండి కొట్టేసి క్విడ్ ప్రోకోగా వారికి 2,800 కోట్లు ఇస్తున్నారు స్మార్ట్ మీటర్లలో రూ.18 వేలు విలువ గల దాన్ని రూ.30 వేలకు కొనుగోలు చూస్తూ ఖర్చు చేయబోయే రూ.31 వేల కోట్లలో రూ.12 వేల కోట్లు కమీషన్ కొట్టేస్తున్నారు. ఈ భారాలు విద్యుత్ వినియోగదారులపై చేస్తున్నారన్నారు.

సెకీ ఒప్పందం ద్వారా రూ.20 వేల కోట్లు భారం విద్యుత్ వినియోగదారులపై వేస్తున్నరన్నారు.

కోతలు లేని కరెంటు ఇవ్వాలని, విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపైన, ఒప్పందాలపైన విచారణ సంఘం ఏర్పాటు చేయాలన్నారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, అవినీతి కోసం పెడుతున్న మోటార్లకు మీటర్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా విద్యుత్ డీఈకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page