SAKSHITHA NEWS

Group-I Exam on 8th of this month

ఈ నెల 8న గ్రూప్-I పరీక్ష
జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలు
హాజరు కానున్న 5600 మంది అభ్యర్థులు

గ్రూప్-I పరీక్షలు నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎపిపిఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-I పరీక్షలు ఈ నెల 8న జరుగుతున్న పరీక్షలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైజన్ ఆఫీసర్లు గా సీనియర్ జిల్లా అధికారులను నియామకం చేసినట్లు చెప్పారు.పరీక్షాలను సందర్శించిన ప్రాంతాల్లో సమస్యలను లైజన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.మెటీరియల్ తీసుకువెళ్లే వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.లైజన్ అధికారులు మెటీరియల్ తీసుకువెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.ఉదయం,మధ్యాహ్నం జరిగే పరీక్షలకు రెండు రంగులు ఉంటాయన్నారు.చెక్ లిస్ట్ తో డిస్పాచ్ చేయాలని ఆదేశించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించాలన్నారు.

ఈ పరీక్షలకు 5600 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు.24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున మొత్తం 219 మందిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10.00 గంటలు నుండి 12.00 గంటల వరకు,మధ్యాహ్నం 2.00 నుండి 4 గంటల వరకు జరుగు తుందన్నారు.పరీక్ష కేంద్రాలు వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాల నుండి సరిపడ ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గ్రూప్ – I పరీక్షలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలని,ఎవరికి అప్పగించిన విధులు వారు బాధ్యతతో పనిచేయాలన్నారు. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.సిటింగ్ ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలన్నారు. ప్రధమ చికిత్స ఏర్పాట్లు చేయాలని,కోవిడ్ నిబందనలుతో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనులు జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల వద్ద విద్యుత్ అంతరాయం కలుగకుండా చూసుకోవాలని ఎపిఇపిడిఎల్ అధికారులకు చెప్పారు.

ముందుగానే సిటింగ్ ఏర్పాట్లు,వెలుతురు ఉందా లేదా చూడాలని దీనిపై చీఫ్ సూపరింటెండెంట్లు దృష్టి సారించాలని స్పష్టం చేశారు.కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని, పరీక్షకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా 08942 240557 నంబర్ కు ఫోన్ చేయవలసినదిగా ఆయన అభ్యర్థులను కోరారు.కంట్రోల్ రూమ్ ఆదివారం సాయంత్రం వరకు పనిచేస్తుందన్నారు.


SAKSHITHA NEWS