Grievance Day applications should be given importance and prompt action taken.
గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాముఖ్యత నిచ్చి, సత్వర చర్యలు చేపట్టాలి.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాముఖ్యత నిచ్చి, సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ మందిరంలో నిర్వహించిన “గ్రీవెన్స్ డే”లో అర్జీదారులను నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా, వేంసూరు మండలం అమ్మపాలెంకు చెందిన ఆత్మకూరి నాగేశ్వరరావు తనకు అమ్మపాలెం లోని సర్వే నెం. 835/అ/ఆ లో 0.1500, సర్వే నెం. 842/ఇ లో 1.2500 లకు మార్కెట్ ధర రూ. 4,50,000 లు ఉండగా, రూ. 30,49,500 లుగా నమోదు అయివున్నదని, తప్పును సరిదిద్దుటకు కోరగా, సబ్ రిజిస్ట్రార్ ను చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.
బాల వెలుగు ఎన్సిఎల్పీ ఉపాధ్యాయులు తమకు మార్చి 2021 నుండి అక్టోబర్ 2022 వరకు 18 నెలల వేతనం రాలేదని, ఇప్పించుటకు కోరగా, పిడి, ఎన్సీఎల్పీ ని చర్యలకై ఆదేశించారు. ముత్తగూడెం గ్రామం ఖమ్మం రూరల్ మండలం నుండి ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, ఖాసీం, పుల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, మల్లయ్యలు తమకు ఆసరా పెన్షన్ మంజూరు కు కోరగా, డిఆర్డీఓ కు తగు చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం నుండి వెంకటేశ్వర్లు, తనకు పెన్షను మంజూరు అయినదని, కానీ ఖాతాలో జమ కావడం లేదని దరఖాస్తు ద్వారా తెలుపగా, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ పరిశీలనకై కలెక్టర్ అన్నారు.
మధిర మండలం, మాటూరు గ్రామం నుండి మారిశెట్టి వెంకట కృష్ణ దరఖాస్తు ద్వారా మాటూరు గ్రామం విద్యానగర్, మాటూరు గా విభజించబడిందని, తాను వికలాంగుడినని, తాను విద్యానగర్ లో రేషన్ షాపు కొరకు పెట్టుకున్న దరఖాస్తు కు ఆమోదించి, రేషన్ షాపు డీలర్ గా నియమించాలని కోరగా, జిల్లా పౌరసరఫరాల అధికారిని పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
వెంకటగిరి క్రాస్ రోడ్, ఇందిరమ్మ కాలనీ నుండి కటకం హరిత, తాము బాబును దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు సహాయం కొరకు కోరగా, జిల్లా సంక్షేమ అధికారిని తగు చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. పెనుబల్లి మండలం రంగారావు బంజార నుండి గ్రామస్థుడు గ్రామంలో చర్చి, ప్రాథమిక పాఠశాలలకు దగ్గరలో బెల్టు షాపు పెట్టి, అధిక ధరకు మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు, చర్యలకై కోరగా, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.
చింతకాని మండలం కోదుమూరు గ్రామం నుండి చింతనిప్పు సత్యం, తనకు సర్వే నెం. 327/ఉ లో 16 ఎకరాల 27 గుంటల భూమి మిస్సింగ్ ఖాతాలో ఉన్నట్లు, దీనికై సరిచేసి, పాస్ బుక్ జారీకి దరఖాస్తు చేసినట్లు మంజూరుకు కోరగా, పరిశీలించి, తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. అల్లీపురం గ్రామం, ఖమ్మం అర్బన్ మండలం నుండి కాశిమల్ల కాంతమ్మ తనకు ధాంసలాపురం రెవిన్యూ పరిధిలో సర్వే నెం. 500/ఆ4 లో 23 గుంటల భూమి ప్రొహిబిటెడ్ లో నమోదు అయినట్లు, తొలగించాలని దరఖాస్తు చేయగా,
పరిశీలించి, తగుచర్యలకై కలెక్టరేట్ ధరణి పర్యవేక్షకున్ని కలెక్టర్ ఆదేశించారు. ఇట్టి “గ్రీవెన్స్ డే”లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, జెడ్పిసిఇఓ వి.వి. అప్పారావు, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.